Random Video

AP farmers Tour to Singapore సింగపూర్‌కు AP రైతులు : బాబు నా మజాకా | Oneindia Telugu

2017-10-31 148 Dailymotion

Andhra Pradesh Chief Minister, N. Chandrababu Naidu, on Monday flagged off a bus carrying 34 Singapore-bound farmers, from Amaravati. It was the first such batch. AP Capital Region Development Authority (CRDA) is organising this trip for the farmers who parted with their land for the construction of capital city Amaravati.
విమాన ప్రయాణం అనేది చాలా మంది కల. అయితే చాలామందికి అది నెరవేరుతుంది. కానీ పొలం దున్నే రైతుకు మాత్రం అది కలల్లోనే ఉండిపోతుంది. రైతుకు విదేశీ ప్రయాణం అనేది చాలా దూరంలో ఉండే మాట. అయితే రాజధాని రైతులు మాత్రం విమానం ఎక్కేస్తున్నారోచ్. ఎలా అంటారా సింగపూర్‌ తరహాలో రాజధాని ఉంటుందని చెప్పిన ap ప్రభుత్వం 34 మంది రైతులను సింగపూర్‌ పంపిస్తుంది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి భూములిచ్చిన రైతుల బృందం సోమవారం అమరావతి నుంచి సింగపూర్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా రైతు యాత్రను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రైతుల బృందం సింగపూర్‌ వెళ్లనుంది. రాజధానికి భూమలిచ్చిన రైతుల్లో మొత్తం 123 మంది ఉండగా, తొలి విడతగా 34 మంది రైతులను సింగపూర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిస్తోంది. అక్కడ నాలుగురోజుల పాటు వారితో పాటు అధికారులు ఉండి సింగపూర్‌ అభివృద్ధిని వివరిస్తారు. .అమరావతి రాజధాని నిర్మాణం ఏ స్థాయిలో ఉండబోతుందో సింగపూర్‌ను ఉదాహరణగా చూపుతారు.రైతులకు భోజన, వసతి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సింగపూర్‌ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చేప్పానని గుర్తుచేశారు.